
న్యూఢిల్లీ: కొత్తగా నిర్మిస్తున్న పార్లమెంట్ భవనంలో మూడు అండర్‌గ్రౌండ్ టన్నెల్‌లు రూపొందిస్తున్నారని సమాచారం. ఈ టన్నెల్‌లు ప్రధాన మంత్రి నివాసానికి అనుసంధానమై ఉంటాయని, అలాగే వైస్ ప్రెసిడెంట్ హౌస్, ఎంపీలు, కొత్త పార్లమెంట్ కాంప్లెక్స్‌కు కూడా ఇవి కనెక్ట్ అయి ఉంటాయని తెలుస్తోంది. జాతీయ మీడియా చెప్పిన రిపోర్టు ప్రకారం.. వీవీఐపీలు పార్లమెంట్‌లోకి వెళ్లడానికి, బయటకు రావడానికి ఎక్కువ అంతరాయం లేకుండా టన్నెళ్లను నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నారు. రెగ్యులర్ విజిటర్స్, టూరిస్టులు సందర్శించే రూట్లలో ప్రజల తాకిడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీవీఐపీలకు అధిక సెక్యూరిటీని కల్పించేందుకు ఈ టన్నెళ్ల నిర్మాణానికి కేంద్రం కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తోంది. పార్లమెంట్ రీకన్‌స్ట్రక్షన్‌కు సంబంధించి ప్రభుత్వం కఠిన టైమ్‌లైన్స్‌ను రూపొందించిందని సమాచారం.