దగ్గు టానిక్ తో సహా ఇతర ఔషధ టానిక్ ల విక్రయంపై కొత్త రూల్స్.. ఇకపై ఈ టానిక్ లను డాక్టర్ల సలహాలతో నే వినియోగించాలి. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఈ టానిక్ లను విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని ఫార్మీసీ లకు కేంద్రం వార్నింగ్ ఇచ్చింది. ఓవర్ ది కౌంటర్ సిరప్ లకారణంగా ఇటీవల పలువురు చిన్నారులు చనిపోయిన క్రమంలో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. జూన్ 9న జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం డ్రగ్ రూల్స్ లోని షెడ్యూల్ కె నుంచి సిరప్ లు అనే పదాన్ని తొలగించి కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఈ మార్పులను తీసుకొచ్చింది.
గతంలో మధ్యప్రదేశ్, రాజస్థాన్ సహా పలు రాష్ట్రాల్లో కల్తీ దగ్గు సిరప్‌ల కారణంగా పలువురు చిన్నారులు చనిపోయారని ఆరోపణలు రావడంతో ఔషధాల నాణ్యత, భద్రతపై ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కొత్త నిబంధనల వల్ల సాధారణంగా ప్రిస్క్రిప్షన్ లేకుండా కొనుగోలు చేసే దగ్గు సిరప్‌లు, ఇతర ద్రవ ఔషధాలను ఇకపై డాక్టర్ సూచనతోనే కొనుగోలు చేయాలి. ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా ఔషధాల విక్రయ విధానంలో కీలక మార్పుగా భావిస్తున్నారు.
