45 యూట్యూబ్ వీడియోలను బ్లాక్ చేసిన కేంద్రం

45 యూట్యూబ్ వీడియోలను బ్లాక్ చేసిన కేంద్రం

ఫేక్  వార్తలను ప్రసారం చేస్తున్న యూట్యూబ్‌ చానెల్స్‌పై  కేంద్రం మరోసారి కొరడా ఝుళిపించింది. 10 ఛానెల్స్ నుండి 45 యూట్యూబ్ వీడియోలను బ్లాక్ చేసింది.అగ్నిపథ్‌, ఆర్మీ, కశ్మీర్‌ అంశాలపై తప్పుడు వార్తలు ప్రసారం చేస్తున్నట్లు గుర్తించిన కేంద్రం..  ఆ వీడియోలను  బ్లాక్‌ చేసింది. ఈ విషయాన్ని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు.

ఇలాంటి వీడియోలు దేశంలో మత సామరస్యానికి, ప్రజాశాంతికి భంగం కలిగించేలా  ఉన్నాయని  ఆయన తెలిపారు.  ఇంటెలిజెన్స్ ఏజెన్సీల ఇన్‌పుట్‌ల ఆధారంగా వీడియోలను బ్లాక్ చేసినట్లు తెలిపారు.  బ్లాక్ చేయబడిన వీడియోలకు 1. 3 కోట్లకు పైగా వ్యూస్ ఉన్నాయి. ఇటీవల కేంద్రం పెద్ద ఎత్తున యూట్యూబ్‌ చానెల్స్‌పై నిషేధం విధించిన సంగతి తెలిసిందే.