
రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర మహారాష్ట్రలో కొనసాగుతోంది. ఇవాళ ఉదయం 6 గంటలకు పటూర్ లోని అకోలా నుంచి పాదయాత్రను ప్రారంభించారు. పార్టీ కార్యకర్తలు యాత్రలో భారీగా పాల్గొన్నారు . ప్రజలతో మమేకం అవుతూ రాహుల్ ముందుకు సాగుతున్నారు. ఇప్పటికి రాహుల్ పాదయాత్ర 70 రోజులు పూర్తి చేసుకుంది. మహారాష్ట్రలో మొత్తం 14 రోజుల పాటు రాహుల్ పాదయాత్ర కొనసాగనుంది. ఈనెల 20న మధ్యప్రదేశ్ లోకి రాహుల్ పాదయాత్ర ప్రవేశించనుంది. దేశ ప్రజలను ఏకం చేసేందుకే ఈ పాదయాత్ర చేస్తున్నట్లు కాంగ్రెస్ ప్రకటించింది.
మాలెగావ్ లో భారత్ జోడో యాత్రలో ప్రజలనుద్దేశించి మాట్లాడిన రాహుల్ గాంధీ..దేశంలో నిత్యావసర ధరలు పెంచి మధ్యతరగతి ప్రజల నడ్డి విరిచారని ఆరోపించారు. రైతుకు కనీస అవసరాలు అయిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ సిలిండర్ల ధరలు పెంచి వారిపై మోయలేని భారం మోపిందని మండిపడ్డారు. అగ్నివీర్ పేరుతో కేంద్రం యువత మనోభావాలతో ఆటలాడుతోందని రాహుల్ గాంధీ విమర్శించారు.