ప్రజలు బాధల్లో ఉంటే రేట్లు పెంచి సొమ్ము చేసుకుంటారా?

ప్రజలు బాధల్లో ఉంటే రేట్లు పెంచి సొమ్ము చేసుకుంటారా?

పెట్రో రేట్లపై ప్రధానికి సోనియా లేఖ

న్యూఢిల్లీ: దేశంలో రోజురోజుకీ పెట్రోల్, డీజిల్ రేట్లు పెరుగుతుండటంపై కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు పెరుగుతున్న పెట్రో రేట్ల గురించి వివరిస్తూ ప్రధాని మోడీకి సోనియా లేఖ రాశారు. ప్రజలకు నష్టం కలిగించే ఇలాంటి చర్యలకు ఏ ప్రభుత్వం పూనుకుంటుందంటూ లెటర్‌లో సోనియా ఫైర్ అయ్యారు. ప్రజలు కష్టాలు, బాధలను కేంద్రం సొమ్ము చేసుకుంటోందంటూ విమర్శించారు. ‘దేశంలో చమురు ధరలు ఎన్నడూ లేనంతగా పెరిగాయి. ధరలో స్థిరీకరణ లేదు. కొన్ని రాష్ట్రాల్లో అయితే ఏకంగా లీటర్ రూ.100 మార్కును చేరుకుంది. ఇది లక్షలాది రైతుల బాధను మరింతగా పెంచింది’ అని లేఖలో సోనియా రాసుకొచ్చారు.