ధరల పెరుగుదలపై సాకులు చెప్పి తప్పించుకుంటారా?

ధరల పెరుగుదలపై సాకులు చెప్పి తప్పించుకుంటారా?

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ విమర్శలకు దిగారు. ధరలు పెరుగుతున్నా కేంద్రం పట్టించుకోవడం లేదని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ నిర్వహిస్తున్న ‘స్పీకప్ సోషల్ అగెనెస్ట్ ప్రైజ్ రైజ్’ అనే సోషల్ మీడియా క్యాంపెయిన్‌‌లో భాగంగా రాహుల్ పైవ్యాఖ్యలు చేశారు. దేశాన్ని కేంద్రం నాశనం చేస్తోందని, దీనిపై ప్రజలు గళం విప్పి పోరాడాలని ఆయన కోరారు. పన్నుల ద్వారా ఆదాయం పొందాలనే ఉద్దేశంతో సర్కార్ కావాలనే ఇలా చేస్తోందని ఆరోపించారు. ద్రవ్యోల్బణం దిశగా ప్రజలను నెడుతూ గందరగోళాన్ని సృష్టిస్తోందన్నారు.

కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ వాద్రా కూడా బీజేపీ ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధించారు. ‘చలికాలం వల్ల రేట్లు పెరిగాయని, ఇంతకుముందు ఉన్న ప్రభుత్వాల వల్లే ధరలు ఎక్కువయ్యాయని కేంద్రం అంటోంది. అలాగే ప్రజలు తక్కువ దూరాలు చేస్తున్నందునే రేట్లు పెరుగుతున్నాయని, రోజురోజుకీ పెరుగుతున్న పెట్రోల్-డీజిల్ ధరలపై తమ నియంత్రణ లేదంటూ కేంద్రం చెబుతోంది. సామాన్యుల పరిస్థితిని పట్టించుకోకుండా ఏవో సాకులు చెప్పి తప్పించుకునేందకు యత్నిస్తున్నారు’ అంటూ ప్రియాంక ఫైర్ అయ్యారు.