
న్యూఢిల్లీ: సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ (సీఏపీఎఫ్), అస్సాం రైఫిల్స్‌లో జనవరి 1 నాటికి1.09 లక్షల ఖాళీలున్నాయని కేంద్రం రాజ్యసభకు వెల్లడించింది. 72,689 పోస్టుల భర్తీకి చర్యలు కొనసాగుతున్నాయని చెప్పింది. సెంట్రల్ ఆర్మ్ డ్ ఫోర్సెస్ లో ఖాళీలకు సంబంధించి బుధవారం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ ఒక ప్రశ్నకు సమాధానమిచ్చారు. సీఏపీఎఫ్ లో మంజూరు చేసిన పోస్టుల సంఖ్య 2021లో10,04,980 ఉండగా.. 2025 నాటికి ఆ సంఖ్య10,67,100కి పెరిగిందని తెలిపారు.
పాత వాహనాలను బ్యాన్ చేయలె
దేశ రాజధాని ఢిల్లీలో కాలంచెల్లిన పాత వాహనాలను ప్రభుత్వం నిషేధించలేదని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. 10 ఏండ్లకు పైబడిన డీజిల్ వాహనాలు, 15 ఏండ్లకు పైబడిన పెట్రోల్ వాహనాలను ఎన్ సీఆర్‌లో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్ జీటీ) నిషేధించిందని చెప్పారు. బుధవారం రాజ్యసభలో వెహికల్ స్క్రాపింగ్ పాలసీకి సంబంధించిన ప్రశ్నకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ లిఖిత పూర్వకంగా సమాధానమిచ్చారు.