హైదరాబాద్, వెలుగు: స్లీప్ సొల్యూషన్స్అందించే సెంచరీ మ్యాట్రెస్సెస్ నిజామాబాద్ వినాయక నగర్లో కొత్త ఎక్స్‌పీరియన్స్ స్టోర్ ప్రారంభించింది. తెలంగాణ వ్యాప్తంగా రిటైల్ నెట్‌వర్క్ విస్తరణలో భాగంగా ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.
ప్రారంభోత్సవ ఆఫర్ కింద మ్యాట్రెస్ కొనుగోలుపై 20 శాతం, సోఫాలపై 40 శాతం వరకు తగ్గింపు అందిస్తున్నారు. అర్హత ఉన్న కొనుగోళ్లపై పిల్లోస్, బెడ్ షీట్లు ఉచితంగా లభిస్తాయి. ఫైనాన్స్ సౌకర్యమూ ఉందని కంపెనీ తెలిపింది.
