పెరగనున్న వొడాఫోన్ ఐడియా టారిఫ్‌‌లు

పెరగనున్న వొడాఫోన్ ఐడియా టారిఫ్‌‌లు

న్యూఢిల్లీ: గత ఏడాది కాలంగా రేట్లను పెంచుతూ వస్తున్నప్పటికీ దేశంలో  టారిఫ్‌‌లు ఇంకా తక్కువగానే ఉన్నాయని వొడాఫోన్ ఐడియా సీఈఓ అక్షయ్‌‌ మూంద్ర అన్నారు. ఈ లెవెల్‌‌లో సస్టయిన్ కాలేమని, కొత్త ఇన్వెస్ట్‌‌మెంట్లను ఆకర్షించాలంటే టారిఫ్‌‌లలో మార్పులు రావాలని చెప్పారు. కాగా, వొడాఫోన్ ఐడియా యావరేజ్ రెవెన్యూ పెర్ యూజర్‌‌‌‌ (ఆర్పూ)  ఈ ఏడాది సెప్టెంబర్‌‌‌‌తో ముగిసిన క్వార్టర్‌‌‌‌లో రూ. 131 కి పెరిగింది.

 కిందటేడాది సెప్టెంబర్ క్వార్టర్‌‌‌‌తో పోలిస్తే ఇది 19.5 శాతం ఎక్కువ. టారిఫ్‌‌లు పెరగడం, యూజర్లు అప్‌‌గ్రేడ్‌‌ కావడంతో  కంపెనీ ఆర్పూ మెరుగుపడింది. వెండర్లతో కలిసి పనిచేస్తున్నామని, ఒక్కసారి ఫండింగ్‌‌ అందితే 5జీ టెక్నాలజీని  అందుబాటులోకి తెస్తామని  ఇండియా మొబైల్ కాంగ్రెస్‌‌లో పాల్గొన్న మూంద్ర పేర్కొన్నారు.