యూరియా ఉత్పత్తిలో టార్గెట్ రీచ్ : రామగుండం ఆర్ఎఫ్సీఎల్ సీజీఎం​

యూరియా ఉత్పత్తిలో టార్గెట్ రీచ్ : రామగుండం ఆర్ఎఫ్సీఎల్ సీజీఎం​

గోదావరిఖని, వెలుగు: రామగుండం ఫర్టిలైజర్స్​ అండ్​ కెమికల్స్​ లిమిటెడ్(ఆర్ఎఫ్సీఎల్) ప్లాంట్​లో ఈ ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్​ నుంచి సెప్టెంబర్​ వరకు ఆరు నెలల కాలంలో నిర్దేశించిన యూరియా ఉత్పత్తి టార్గెట్​ను రీచ్​ అయ్యామని సీజీఎం​ఉదయ్​ రాజహంస తెలిపారు. మంగళవారం మీడియాకు వివరాలు వెల్లడించారు. ఆరు నెలల్లో 6 లక్షల మెట్రిక్​ టన్నుల యూరియా ఉత్పత్తి లక్ష్యంగా నిర్ణయించగా, 6,17,600.43 మెట్రిక్  టన్నుల యూరియాను ఉత్పత్తి చేసినట్లు తెలిపారు.

 ఇందులో తెలంగాణకు 2,16,036.45 మెట్రిక్  టన్నులు, ఏపీకి​56,481.30 మెట్రిక్  టన్నులు, కర్నాటకకు 1,33,897.77 మెట్రిక్  టన్నులు, మహారాష్ట్రకు 66,436.92 మెట్రిక్  టన్నులు, చత్తీస్​ఘడ్​కు 43,869.06 మెట్రిక్ టన్నులు, తమిళనాడుకు 46,529.91 మెట్రిక్ టన్నులు, మధ్యప్రదేశ్​కు 54,349.02 మెట్రిక్  టన్నుల యూరియా సప్లై చేశామని చెప్పారు. ఆర్ఎఫ్సీఎల్​లో పూర్తి స్థాయి యూరియా ఉత్పత్తిని సాధించడంలో కీలకపాత్ర పోషించిన కార్మికులు, ఉద్యోగులు, ఆఫీసర్లను సీజీఎం అభినందించారు. దేశంలో ఎరువుల కొరతను తీర్చేందుకు ఆర్ఎఫ్సీఎల్​ ప్లాంట్​ తనవంతు పాత్ర  పోషిస్తుందని తెలిపారు.