బినోయ్ విశ్వం అరెస్టుపై చాడ వెంకట్రెడ్డి ఫైర్

 బినోయ్ విశ్వం అరెస్టుపై చాడ వెంకట్రెడ్డి ఫైర్

హనుమకొండలో సీపీఐ జాతీయ నేత, ఎంపీ  బినోయ్ విశ్వంను  పోలీసులు అరెస్ట్  చేయడంపై సీపీఐ నేత  చాడ వెంకట్ రెడ్డి ఫైర్ అయ్యారు.  సిపిఐ ఆధ్వర్యంలో  జరుగుతున్న భూ పోరాట  ఉద్యమానికి  బినోయ్ విశ్వం సంఘీభావం తెలపడానికి వచ్చారన్నారని ఆయన చెప్పారు.  ప్రజలను కలిసి, వారికి ఇళ్ల స్థలాలు కేటాయించాలని  ప్రభుత్వాన్ని కోరడానికి  వచ్చిన బినోయ్ ను అక్రమంగా అరెస్ట్  చేశారని ఆరోపించారు.

శాంతిభద్రతల పేరుతో పోలీసులు ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తున్నారంటూ చాడ వెంకట్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అరెస్ట్  చేసిన సీపీఐ నేతలు, కార్యకర్తలను వెంటనే రిలీజ్  చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

మరిన్న