మాకు 9 to 5 పని చేసే ఉద్యోగులు వద్దు : యంగ్ బిజినెస్ మ్యాన్ కామెంట్స్

మాకు 9 to 5 పని చేసే ఉద్యోగులు వద్దు : యంగ్ బిజినెస్ మ్యాన్ కామెంట్స్

అతడి వయస్సు 23 ఏళ్లు మాత్రమే.. క్రియేటివిటీలోనే కాదు.. మార్కెట్ ను అంచనా వేయటంలో మాత్రం తలపండినోడు..అందుకే ఇంత చిన్న వయస్సులో 150 కోట్ల రూపాయల వ్యాపారాన్ని నడుపుతున్నాడు. అతడే ఛాయ్ సుత్తా బార్.. ప్రపంచవ్యాప్తంగా 500 ఔట్ లెట్స్ ఉన్నాయి.. ఈ కంపెనీ ఓనర్ అభినవ్ దూబే ఇటీవల ఎక్స్ లో ఓ పోస్టు పెట్టాడు.. దాని సారాంశం ఏంటో తెలుసా..

మేం ఉదయం 9 గంటలకు వచ్చి సాయంత్రం 5 గంటలకు వెళ్లిపోయే ఉద్యోగుల కోసం వెతకటం లేదు..మార్కెట్ ను దున్నేసే ఓ సైన్యం కోసం చూస్తు్న్నాం..దీన్ని మరింత ఘాటుగా ఇంగ్లీష్ పోస్టు చేశాడు. దీంతో ఇది నిమిషాల్లో వైరల్ అయ్యింది.

ఏదైనా లక్ష్యాన్ని సాధించాలంటే వ్యక్తులకు ప్రేరణ చాలాముఖ్యం. మోటివేషనల్ స్పీచ్లు, సక్సెస్ సాధించిన వ్యక్తుల నుంచి పొందిన స్ఫూర్తి ఎంతోమందిని తమ లక్ష్యం వైపు మళ్లించొచ్చు. అతి చిన్న వయస్సులో 150 కోట్ల రూపాలయ వ్యాపారాన్ని నడుతుపున్న ఛాయ్ సుత్తా బార్ ఓనర్ అభినవ్ దూబే అంటే యూత్ కు ఇన్స్పిరేషన్.. ఓ రోల్ మోడల్. దూబే ఎక్స్ లో పెట్టిన మోటివేషనల్  పోస్ట్ ఇప్పుడు చర్చనీయాంశమైంది. 

దూబె వీడియో ఎక్స్ లో 7.24 లక్షల వ్యూస్ పొందింది..నెటిజన్లు ఆసక్తికరమైన పోస్టులతో చర్చలో పాల్గొన్నారు. బ్రో చిల్ అంటూ కొంతమంది మేసేజ్ చేశారు. బ్రో..బోర్డర్ లో గానీ టీషాప్ పెడతారా ఏంటీ అంటూ హాస్యోక్తులు విసిరారు. కొందరు దుబే పోస్ట్ ను విమర్శించినా.. కొందరు మాత్రం సమర్ధించారు. ఈ చర్చ కాస్త.. దూబే ప్రతిపాదన పట్ల యూత్ కు ఉన్న అభిప్రాయం వెల్లడైంది. అనుభవ్ దూబే కోరుకుంటున్న విధంగా ఉద్యోగులు ఎంతమంది ఆసక్తి చూపుతారో వేచి చూడాలి.