రెండు నిమిషాల వీడియోలతో చాయ్ షాట్స్‌‌

రెండు నిమిషాల వీడియోలతో చాయ్ షాట్స్‌‌

తెలుగు డిజిటల్ రంగంలో తనకంటూ ఓ మార్క్ క్రియేట్ చేసుకున్న  ‘చాయ్ బిస్కెట్’ సంస్థ.. ఇప్పుడు ‘చాయ్ షాట్స్‌‌’ పేరుతో  ఓటీటీ యాప్‌‌ను లాంచ్ చేసింది. ఇందులో రెండు  నిమిషాలలోపు ఉండే  ప్రీమియం, వెర్టికల్, స్క్రిప్టెడ్ ఎపిసోడ్లు ఉంటాయని నిర్వాహకులు అనురాగ్, శరత్ అన్నారు. 

ఈ యాప్ లాంచ్ ఈవెంట్‌‌లో పాల్గొన్న రానా దగ్గుబాటి మాట్లాడుతూ ‘శరత్, అనురాగ్ ఆలోచనలు ఇన్నోవేటివ్ గా క్రియేటివ్ గా ఉంటాయి. వాళ్ళు తెలుగు యంగ్ ఆడియెన్స్‌‌ని బాగా  అర్థం చేసుకున్నారు.  వాళ్ల జర్నీలో నేను ఒక చిన్న పార్ట్ అవడం ఆనందంగా ఉంది. తాజాగా వాళ్లు క్రియేట్ చేసిన   చాయ్ షాట్స్.. దేశవ్యాప్తంగా ఉన్న కంటెంట్ క్రియేటర్స్‌‌కు ఒక ఎక్స్‌‌ట్రీమ్ పవర్.  ఈ ఐడియాని సపోర్ట్ చేస్తూ ఇందులో ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్టర్స్ అందరికీ ఆల్ ది బెస్ట్. ఇందులో వివిధ భాషల్లో ఉన్న కంటెంట్ సినిమాల స్థాయిలో పాపులర్ అవ్వాలని కోరుకుంటున్నా’ అని అన్నాడు.  

నిర్మాత రవి శంకర్ మాట్లాడుతూ ‘మైత్రి మూవీ మేకర్స్‌‌లో అనురాగ్, శరత్ హార్డ్ వర్క్ కూడా ఉంది.  చాలా క్రియేటివ్  ఐడియాలు ఇచ్చారు. వాళ్లకు మా సపోర్ట్ తప్పకుండా ఉంటుంది’ అని అన్నారు.  ఇదొక  గొప్ప  ప్రయాణమని, తమ  లైఫ్‌‌లో  నెక్స్ట్ చాప్టర్ మొదలు పెడుతున్నామని శరత్, అనురాగ్ అన్నారు.

 ఈ ‘చాయ్ షాట్స్‌‌’కు ఇన్వెస్టర్లుగా  ఉన్న  స్విగ్గీ ఫౌండర్స్  శ్రీ హర్ష మజేటి,  నందన్ రెడ్డి, రెడ్ బస్ ఫౌండర్ ఫణీంద్ర సమా, ఫిజిక్స్‌‌వాలా ఫౌండర్స్  అలఖ్ పాండే,  ప్రత్యీక్ మహేశ్వరి, రాపిడో ఫౌండర్స్ అరవింద్ సాంకా, పవన్ గుంటుపల్లి, రిషికేశ్,  డార్విన్‌‌బాక్స్  కో ఫౌండర్  రోహిత్ చెన్నమనేని, విర్జియో ఫౌండర్  అమర్ నగరం పాల్గొన్నారు.