హిందూజా గ్రూప్ చైర్మన్ గోపీచంద్ పి హిందూజా కన్నుమూత..

హిందూజా గ్రూప్ చైర్మన్ గోపీచంద్ పి హిందూజా కన్నుమూత..

హిందూజా గ్రూప్ చైర్మన్ గోపీచంద్ పి హిందూజా ఇవాళ లండన్‌లో కన్నుమూశారు. ఆయన 85 సంవత్సరాల వయస్సులో మరణించారు. హిందూజా మరణంపై భారతదేశంతో పాటు అంతర్జాతీయ వ్యాపారవేత్తలు దిగ్భాంతి వ్యక్తం చేస్తున్నారు. హిందూజా గ్రూప్‌లో రెండవ తరం వారసుడిగా కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఆయన హిందూజా గ్రూప్‌లో రెండో తరం వారసుడిగా 2023లో సోదరుడు శ్రీచంద్ హిందూజా మరణానంతరం ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. ముంబైలో 1959లో ఫ్యామిలీ బిజినెస్ లోకి ఎంట్రీ ఇచ్చాక.. తొలుత ఇండో-మిడిల్ ఈస్ట్ ట్రేడింగ్‌ నిర్వహిస్తూ, ఆ తర్వాత వ్యాపార విస్తరణలో ముఖ్య పాత్ర పోషించారు.

గోపీచంద్ పర్మానంద్ హిందూజా 1940 జనవరి 29న జన్మించారు. పైగా భారతీయ-బ్రిటీష్ బిలియనీర్ వ్యాపారవేత్త. ప్రస్తుతం గోపీచంద్ నాయకత్వంలో హిందూజా గ్రూప్ ఆటోమోటివ్, బ్యాంకింగ్, హెల్త్, రియల్ ఎస్టేట్ వంటి విభాగాల్లో విస్తరిస్తోంది. 1984లో Gulf Oil కొనుగోలు.. ఆ తర్వాత 1987లో భారత్ దేశానికి ప్రఖ్యాత ఆటో దిగ్గజ సంస్థ Ashok Leylandను తీసుకోవడం లాంటి వ్యూహాత్మక నిర్ణయాలు వెనుక ఆయన పాత్ర కీలకమైనదిగా చెప్పుకోవచ్చు. 

ప్రస్తుతం హిందూజా గ్రూప్ దాదాపు 11 విభిన్న వ్యాపారాల్లో కొనసాగుతోంది. బ్రిటన్‌లో అత్యంత సంపన్న కుటుంబాల్లో హిందూజా కుటుంబానిది ప్రథమ స్థానంలో ఉన్నారు. గోపీచంద్ కు.. భార్య సునిత, కొడుకులు సంజయ్, ధీరజ్, కుమార్తె రితా ఉన్నారు. వ్యాపారంలో నూతన మార్గాలను ఎప్పటికప్పుడు అన్వేషిస్తూ.. ప్రపంచస్థాయిలో వ్యాపారంలో భారతీయ ప్రతిష్టను పెంచడంలో సుదీర్ఘ సేవలు అందించారు గోపిచంద్.

జై హింద్ కాలేజీ నుంచి డిగ్రీ పొందిన గోపీచంద్‌కి లండన్ వెస్ట్మిన్స్టర్ యూనివర్సిటీ, రిచ్మండ్ కాలేజీల నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్నారు.