
- పార్లమెంట్‌లో ప్లకార్డులు ప్రదర్శించడంపై బీజేపీ ఎంపీ ఫిర్యాదు
న్యూఢిల్లీ, వెలుగు: బీఆర్ఎస్ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యులకు చైర్మన్ కార్యాలయం ప్రివిలేజ్ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 28లోపు నోటీసులపై సమాధానం చెప్పాలని ఎంపీలు కేశవరావు, సురేశ్ రెడ్డి, దామోదర్ రావు, రవిచంద్ర, లింగయ్య యాదవ్‌లకు కోరింది. గత సెప్టెంబర్‌లో నిర్వహించిన పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో బీఆర్ఎస్ ఎంపీలు ప్లకార్డులు ప్రదర్శించడంపై బీజేపీ ఎంపీ, ఉమెన్, చిల్డ్రన్, స్పోర్ట్స్ స్టాండింగ్ కమిటీ చైర్మన్ వివేక్ ఠాకూర్ రాజ్యసభ చైర్మన్‌కు ఫిర్యాదు చేశారు.
ALSO READ : బీసీ కోటా అమలులో కాంగ్రెస్ ఫెయిల్
దీంతో సోమవారం రాజ్యసభ డిప్యూటీ సెక్రటరీ అమిత్ కుమార్ ఎంపీలకు ప్రివిలేజ్ నోటీసులు జారీ చేశారు. పార్లమెంట్ స్పెషల్ సెషన్‌లో భాగంగా సెప్టెంబర్ 18న రాజ్యసభలో బీఆర్ఎస్ ఎంపీలు నిబంధనలకు విరుద్ధంగా సభలో ప్లకార్డులు ప్రదర్శించారని బీజేపీ ఎంపీ నుంచి ఫిర్యాదు అందినట్లు అందులో పేర్కొన్నారు. -