బీసీ కోటా అమలులో కాంగ్రెస్ ఫెయిల్

బీసీ కోటా అమలులో కాంగ్రెస్ ఫెయిల్

మహాసముంద్: స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ.. బీసీలకు రిజర్వేషన్లను సరిగా అమలుచేయలేదని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. ఢిల్లీకి చెందిన కొంతమం ది మహాజ్ఞానులైన కాంగ్రెస్ నేతలు తన కులం గురించి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. 

ప్రధాని పేరిట బీసీ కులాన్ని దొంగ అని పిలుస్తున్నారని ఫైర్ అయ్యారు. సోమవారం చత్తీస్‌‌‌‌గఢ్‌‌ లోని మహాసముంద్ జిల్లాలో జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో మోదీ మాట్లాడారు. ఎన్నో ఏండ్లుగా మెడికల్ కాలేజీల్లో బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయని కాంగ్రెస్ .. ఇయ్యాల ఏవోవో హామీలిస్తే ప్రజలు నమ్మేందుకు సిద్ధంగా లేరన్నారు. చత్తీస్​గఢ్​ను దోచుకుని సొంత ఖజానా నింపుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందన్నారు.

ALSO READ : నోటీసు మాకివ్వకుండా టీవీ చానళ్లకు ఎట్లిస్తరు?