Viral VIDEO : ప్రధాని మోదీ సభలో.. రాహుల్ గాంధీ డొనేట్ చేసిన కుర్చీలు

Viral VIDEO : ప్రధాని మోదీ సభలో.. రాహుల్ గాంధీ డొనేట్ చేసిన కుర్చీలు

మహారాష్ట్రలోని నాగ్‌పూర్ సమీపంలోని యవత్మాల్‌లో మోదీ పాల్గొనటానికి ఓ బహిరంగ సభ ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధానితో పాటు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్, రాష్ట్ర మంత్రివర్గం మొత్తం హాజరుకానున్నారు. ఈ మెగా ఈవెంట్ 47 ఎకరాల విస్తీర్ణంలో విశాలమైన వేదికలో జరుగుతుంది. దీనికి పెద్ద ఎత్తున జనం రానున్నారు. బుధవారం సాయంత్రం 4 గంటలకు ప్రధాని ప్రసంగం ఉంటుంది. ఈ రోజు ఉదయం ఆ సభ ఏర్పాట్లలో భాగంగా కుర్చోడానికి కుర్చీలు వేశారు. అయితే, ఆ కుర్చీలకు కాంగ్రేస్ పార్టీ నేత రాహుల్ గాంధీ స్టిక్రర్లు ఉన్నాయి. దీంతో  బీజేపీ సభలో రాహుల్ గాంధీ డొనేట్ చేసిన కుర్చీలు వేశారని వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 

 

 అసలు ఏం జరిగిందంటే.. ఈ ప్రాంతంలో ఇటీవల కాంగ్రెస్ ర్యాలీ జరిగింది. ఈ కార్యక్రమంలో కుర్చీలు పంపించిన కాంట్రాక్టరే బీజేపీ మీటింగ్ లో కుర్చీలు సరఫరా చేశారు. కాంగ్రెస్ ర్యాలీలో వేసిన కుర్చీలకు రాహుల్ గాంధీ స్టిక్కర్లు అతికించారు. అదే కుర్చీలు స్టిక్కర్లు తీయకుండానే యవత్మాల్ సభకు పంపించారు. దీంతో ఆ సభ ఏర్పాటులో పెద్ద వివాదం జరిగి కుర్చీల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.