
షార్ట్ ఫిల్మ్స్ నుంచి వచ్చి ప్రస్తుతం వరుస సినిమాల్లో నటుడిగా బిజీగా ఉన్నాడు చైతన్య రావు. లీడ్ రోల్స్‌తోపాటు కీలక పాత్రలతో మెప్పిస్తు న్నాడు. అనుష్క లీడ్‌గా క్రిష్ రూపొందించిన ‘ఘాటి’ చిత్రంలో విలన్ పాత్ర పోషించాడు. సెప్టెంబర్ 5న సినిమా విడుదల కానున్న సందర్భంగా చైతన్య రావు ఇలా ముచ్చటించాడు.
‘‘ఇందులో నాది చాలా సీరియస్ అండ్ వైలెంట్ రోల్. లుక్ కోసం చాలా టైం పట్టింది. నా రోల్ చాలా కీలకం. రెగ్యులర్ విలన్‌లా కాకుండా సెపరేట్ మేనరిజంతో డిఫరెంట్‌గా ఉంటుంది. ఇది నాకు ఐకానిక్ క్యారెక్టర్ అవుతుందనే నమ్మకం ఉంది. అనుష్క గారికి నేను పెద్ద ఫ్యాన్‌ని. ఆమెను లైఫ్‌లో ఒకసారి చూస్తే చాలు అనుకున్నాను. అలాంటిది కలిసి నటించడం వెరీ మెమొరబుల్. క్రిష్ గారి డైరెక్షన్‌లో నటించే చాన్స్ రావడం హ్యాపీ. ఆయన చాలా ఫ్రీడమ్ ఇస్తారు. ఈ క్యారెక్టర్‌కి నేను పర్ఫెక్ట్‌గా యాప్ట్ అవుతానని బలంగా నమ్మారు. ఈ సినిమాని తూర్పు కనుమల్లో షూట్ చేశాం. అక్కడ షూట్ చేయడం చాలెంజింగ్. జలపాతం బ్యాక్‌డ్రాప్‌లో రిస్క్ చేసి ఓ సీన్ చేశాం. అద్భుతంగా వచ్చింది. ఆడియెన్స్ థ్రిల్ ఫీలవుతారు. యూవీ క్రియేషన్స్‌లో వర్క్ చేయడం గ్రేట్ ఎక్స్‌పీరియెన్స్. నటీనటులకు ఎంతో కంఫర్ట్ ఇస్తారు. ఇక ఓ నటుడిగా అన్ని రకాల క్యారెక్టర్లు చేయాలని చూస్తున్నా. ప్రస్తుతం క్రాంతి మాధవ్ గారితో ఒక సినిమా చేస్తున్నా. దీంతోపాటు ఇంకొన్ని సినిమాలు అనౌన్స్‌మెంట్‌కు రెడీగా ఉన్నాయి’ అని చెప్పాడు.