నా రూమ్‌‌‌‌‌‌‌‌ కు వస్తే.. ఫారిన్‌‌‌‌‌‌‌‌ ట్రిప్ కు తీస్కెళ్తా

నా రూమ్‌‌‌‌‌‌‌‌ కు వస్తే.. ఫారిన్‌‌‌‌‌‌‌‌ ట్రిప్ కు తీస్కెళ్తా
  • ఢిల్లీలో పీజీ విద్యార్థినులపై స్వామి చైతన్యానంద లైంగిక వేధింపులు

న్యూఢిల్లీ: తనను తాను దేవుడిగా ప్రకటించుకున్న స్వామి చైతన్యానంద సరస్వతిపై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. ఢిల్లీలోని శ్రీ శృంగేరి శారదా పీఠానికి చెందిన ఇన్‌‌‌‌‌‌‌‌స్టిట్యూట్‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌ ఇండియన్‌‌‌‌‌‌‌‌ మేనేజ్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ కాలేజీలో చైతన్యానంద సంచాలక్‌‌‌‌‌‌‌‌(డైరెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌)గా ఉన్నారు. 

పేద విద్యార్థినులే టార్గెట్‌‌‌‌‌‌‌‌గా వేధింపులకు గురిచేశాడు. తన రూమ్‌‌‌‌‌‌‌‌కి వస్తే ఫారిన్‌‌‌‌‌‌‌‌ ట్రిప్‌‌‌‌‌‌‌‌కు తీస్కెళ్తానని, ఖర్చులన్నీ భరిస్తానంటూ మెసేజ్‌‌‌‌‌‌‌‌లు చేశాడు. ఇలా చాలామంది యువతులకు వాట్సాప్‌‌‌‌‌‌‌‌ మెసేజ్‌‌‌‌‌‌‌‌లు చేశాడు. అందులో 17 మంది అమ్మాయిలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది.

మాట వినకపోతే ఫెయిల్‌‌‌‌‌‌‌‌ చేస్తానని బెదిరింపులు

పోలీసుల దర్యాప్తులో దారుణ విషయాలు బయటపడ్డాయి. ఈడబ్య్లూఎస్‌‌‌‌‌‌‌‌ కేటగిరీకి చెందిన పీజీ డొప్లొమా చేస్తున్న 32 మంది అమ్మాయిల నుంచి వాంగ్మూలాలు నమోదు చేశారు. వీరిలో 17 మంది స్వామీజీ నుంచి తీవ్ర అసభ్యకరమైన మెసేజ్‌‌‌‌‌‌‌‌లు వచ్చాయని ఎవిడెన్స్‌‌‌‌‌‌‌‌లు సమర్పించారు. ఆయన డిమాండ్లకు ఒప్పుకోకపోతే ఫెయిల్ చేస్తానని, మార్కులు తక్కువగా వేస్తానని బెదిరించేవాడని పేర్కొన్నారు. ఇదే కాలేజీలో ముగ్గురు మహిళా ఫ్యాకల్టీ మెంబర్లు స్వామీజీ మాట వినాలని ఒత్తిడి చేసేవాళ్లని తెలిపారు.