వీర వనిత చాకలి ఐలమ్మ జయంతి

వీర వనిత చాకలి ఐలమ్మ జయంతి

ఉమ్మడి వరంగల్​జిల్లా వ్యాప్తంగా చాకలి ఐలమ్మ 128 జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మంగళవారం పలువురు నేతలు జిల్లా కేంద్రాల్లో ఆమె విగ్రహాలకు పూలదండలు వేసి నివాళులర్పించారు. జనగామ జిల్లా కేంద్రంలో జడ్పీ చైర్మన్​ పాగాల సంపత్​ రెడ్డి, మున్సిపల్​ చైర్ పర్సన్ పోకల జమున చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఆవిష్కరించారు. 

కలెక్టరేట్​లో అడిషనల్​ కలెక్టర్​ రోహిత్​ సింగ్​ ఆధ్వర్యంలో  ఐలమ్మ జయంతి వేడుకలు నిర్వహించారు.  హనుమకొండ జిల్లాలోని న్యూశాయంపేటలో చీఫ్​ విప్ దాస్యం వినయ్ భాస్కర్​ ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన వెంట వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్, వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్​ ఉన్నారు.  - వెలుగు న్యూస్ నెట్​వర్క్​