ఘనంగా శ్రీవారికి చక్రస్నానం

ఘనంగా శ్రీవారికి చక్రస్నానం

వైకుంఠ ద్వాదశి సందర్భంగా తిరుమలలో శ్రీవారికి చక్రస్నానం నిర్వహించారు వేద పండితులు. శ్రీవారి పుష్కరిణిలో ఏకాంతంగా వేడుకను పూర్తి చేశారు. శ్రీవారి ఆలయం నుంచి చక్రతాళ్వార్ ని ఊరేగింపుగా వరాహస్వామి ఆలయానికి తీసుకువచ్చారు. ఆలయ ప్రాంగణంలో చక్రతాళ్వార్ కి తిరుమంజనం నిర్వహించారు. అక్కడి నుంచి చక్రతాళ్వార్ ను పుష్కరిణి దగ్గరకు తీసుకువచ్చి కర్పూర నీరాజనాలు అందించారు. తర్వాత మూడుసార్లు పుష్కరిణిలో ముంచారు. ద్వాదశి రోజు పుష్కరిణి స్నానమాచరిస్తే సర్వ పాపాలు తొలుగుతాయని భక్తులు నమ్మకం. ఐతే కరోనా నిబంధనలతో చక్రస్నాన ఉత్సవాన్ని ఏకాంతంగా నిర్వహించింది టీటీడీ. 

ఇవి కూడా చదవండి: 

గవర్నర్ తమిళిసై ఇంట భోగి వేడుకలు

సోదరి ఇంట్లో బాలయ్య సంక్రాంతి సంబరాలు