జవాన్‌‌ నుంచి ఛలోనా సాంగ్ రిలీజ్..షారుఖ్- నయనతార కెమిస్ట్రీ అదుర్స్

జవాన్‌‌  నుంచి ఛలోనా సాంగ్ రిలీజ్..షారుఖ్- నయనతార కెమిస్ట్రీ  అదుర్స్

పఠాన్‌‌ మూవీతో బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద రికార్డులు క్రియేట్ చేసిన షారుఖ్ ఖాన్( Shah Rukh Khan)..ఇప్పుడు  జవాన్‌‌(Jawan)గా వచ్చేందుకు రెడీ అవుతున్నారు. తమిళ డైరెక్టర్ అట్లీ(Atlee) తెరకెక్కిస్తున్న ఈ మూవీ నుంచి క్రేజీ రొమాంటిక్ సాంగ్ ను రిలీజ్ చేశారు మేకర్స్.  

ప్రేమలో హాయి ఉందో..ప్రేమలో బాధ ఉందో..ఛలోనా అంటూ ఆస్కార్ విన్నర్ చంద్రబోస్(Chandrabose) తెలుగులో లిరిక్స్ అందించారు. మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ కంపోజ్ చేసిన ఈ మెలోడీ  సాంగ్ ను ఆదిత్య, ప్రియా పాడారు.ఈ సాంగ్ లో షారుఖ్,నయనతార కెమిస్ట్రీ బ్యూటిఫుల్ గా కనిపిస్తోంది. ఈ సాంగ్ లో నయనతార(Nayanthara) డ్రెస్సింగ్ స్టైల్ మెస్మరైజింగ్ గా ఉంది. నయన్ పూల గౌన్లలో కిరాక్ లుక్స్ తో ఆకట్టుకుంటుంది.

హీరో షారుఖ్ ఖాన్ ఇన్‌స్టాగ్రామ్ లో సాంగ్ షేర్ చేస్తూ..ఇష్క్ హో బెహిసాబ్ సా, బేపర్వా, బేహద్ సా! కుచ్ ఐసా హై జవాన్ కా ప్యార్ (ప్రేమ అపరిమితమైనది, అజాగ్రత్త, హద్దుల్లేనిది! జవాన్‌పై ప్రేమ ఇలాంటిది) ..అంటూ పేర్కోన్నారు.

 జవాన్‌‌ నుంచి ఇప్పటికే విడుదలైన ట్రైలర్, సాంగ్స్‌‌కి మంచి రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా ఇటీవల రిలీజ్ చేసిన దుమ్మే దులిపేలా సాంగ్‌‌కు మరింత స్పందన వస్తోంది. ‘చెన్నై ఎక్స్‌‌ప్రెస్’లోని లుంగీ డాన్స్ పాట తరహాలో.. ఈ పాటలోనూ లుంగీ స్టెప్స్‌‌తో ఇంప్రెస్ చేశారు షారుఖ్. ఈ సాంగ్ మ్యూజిక్ చార్ట్స్‌‌లో టాప్‌‌లో ఉండి..పాట పేరుకు తగ్గట్టే దుమ్ము దులుపుతోంది. 

నయనతార హీరోయిన్‌‌గా నటించగా దీపికా పదుకొణె గెస్ట్ రోల్‌‌లో కనిపించనుంది. విజయ్ సేతుపతి, సునీల్ గ్రోవర్, యోగిబాబు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.  ఈ మూవీ సెప్టెంబర్ 7న వరల్డ్‌‌వైడ్‌‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది.