YSRCP అరాచకాల వల్ల పెట్టుబడులు వెనక్కి: చంద్రబాబు

YSRCP అరాచకాల వల్ల పెట్టుబడులు వెనక్కి: చంద్రబాబు

వైఎస్సార్ సీపీపై తీవ్ర విమర్శలు చేశారు ఏపీ మాజీ సీఎం చంద్రబాబు. రాష్ట్రం మీ అబ్బ జాగీరు కాదంటూ ఫైర్ అయ్యారు. రాష్ట్రానికి రెండు కళ్లు లాంటి అమరావతి , పోలవరం ప్రాజెక్టులను బ్రష్టు పట్టిస్తున్నారని అన్నారు. వైఎస్సార్సీపీ నేతలు చేస్తున్న అరాచకాల వల్ల ఏపీలో పెట్టుబడులు పెట్టే వారు కూడా వెనక్కి పోతున్నారని..ఇప్పటికే హైదరాబాద్ కి కొంతమంది వెళ్ళిపోతున్నారని అన్నారు చంద్రబాబు. హడావుడిగా అసెంబ్లీ లో బిల్లులు పెట్టి తాము  వ్యతిరేకించామని ఆరోపణలు  చేయడమేంటని ప్రశ్నించారు. త్వరలోనే అమరావతితో పాటు అన్నింటి పైన నిజానిజాలు బయట పెడతామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దీనిపైన చర్చ జరిగేలా చేస్తామన్నారు.

దాదాపుగా రెండు నెలల అవుతున్నా ఒక్క అభివృద్ధి పని కూడా చేయలేదన్నారు. జగన్ అనుభవ రాహిత్యం కారణంగా రాష్ట్రం బ్రష్టు పడుతుందని విమర్శించారు. వైఎస్సార్సీపీ వైసీపీ వచ్చాక రాజధానితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా  భూముల ధరలు ఒక్కసారిగా పడిపోయాయన్నారు. ఆర్థిక మంత్రి ముళ్ల కంపలు అని వెటకారంగా మాట్లాడుతున్నారని అన్నారు. నిర్మాణంలో ఉన్న  రాష్ట్ర రాజధాని గురించి మేరే ఇలా మాట్లాడితే ..మిగతా వాళ్లు ఎలా మాట్లాడతారని ప్రశ్నించారు.  ఆర్థిక మంత్రి తన విశ్వసనీయతను కోల్పోతున్నారని అన్నారు చంద్రబాబు.