
ఓటమిపై ఏపీ మాజీ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు.జనం పట్టిసీమ నీళ్లు తాగి ఓట్లు వేయడం మర్చిపోయారని కామెంట్ చేశారు. అసలు ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయామో ఇప్పటికీ అర్థం కావడం లేదంటూ వ్యాఖ్యానించారు. గుంటూరు జిల్లా పార్టీ కార్యాలయంలో కార్యకర్తలతో సమావేశమైన చంద్రబాబు ఓటమి తీరుపై పార్టీ కార్యకర్తలతో మాట్లాడారు. 23 సీట్లు ఇచ్చేంత తప్పేమి తాము చేయలేదన్నారు. పాలిచ్చే ఆవును వదిలేసి దున్నను తెచ్చుకున్నారంటూ వ్యాఖ్యానించారు. తన జీవితంలో ఇలాంటి ఎన్నికలు చూడలేదన్నారు చంద్రబాబు.