
వైసీపీ ఉన్మాది సర్కార్ లా వ్యవహరిస్తుందన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. కోడెల మృతిపై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. కోడెలది ప్రభుత్వం చేసిన హత్య అన్నారు. కోడెల మృతిపై మేధావుల్లో చర్చ జరగాలన్నారు. మరే వ్యక్తికీ కోడెలలాంటి పరిస్థితి రాకూడదన్నారు. వైసీపీ ప్రభుత్వానికి పోలీసులు.. ఆలిండియా సర్వీస్ ఉద్యోగులు సరెండర్ అయ్యారని మండిపడ్డారు. కుమారుడు, కూతురు వేధింపుల వల్లే… కోడెల ఆత్మహత్య చేసుకున్నాడని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.