ఆళ్లగడ్డ : యువతకు జాబు కావాలంటే మళ్లీ బాబే రావాలన్నారు TDP అధినేత చంద్రబాబు. మంగళవారం కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో నిర్వహించిన ఎన్నికల ప్రచార రోడ్ షోలో చంద్రబాబు మాట్లాడారు. జగన్ కు కేసీఆర్ ను చూస్తే భయమని.. అందుకే ఆయన కాళ్లు పట్టుకుంటారని చంద్రబాబు విమర్శించారు. ఇటీవల సోనియాగాంధీ తెలంగాణ వచ్చి ప్రత్యేకహోదాపై మాట్లాడితే కేసీఆర్ విమర్శించలేదా అని ప్రశ్నించారు.
పోలవరంపై TRS నేతలు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారని.. అలాంటి వ్యక్తులతో జగన్ కుమ్మక్కై లాలూచీ రాజకీయాలు చేస్తున్నారని చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఎంతమంది కలిసి కుట్రలు చేసినా తననేమీ చేయలేరన్నారు చంద్రబాబు. త్వరలోనే మహిళలందరికీ స్మార్ట్‌ఫోన్లు అందజేస్తామని చెప్పారు. విదేశీ విద్య కింద ఇచ్చే సాయాన్ని రూ.25లక్షలకు పెంచుతామన్నారు. భవిష్యత్తులో చంద్రన్న పెళ్లికానుకను రూ.లక్షకు పెంచుతామని చంద్రబాబు హామీ ఇచ్చారు చంద్రబాబు.
