
మొన్నటి ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం పాలవడం, వైసీపీ కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయడం మనందరికి తెలిసిందే. అయితే ఎన్నికల్లో ఓటమికి గల కారణాలు తనకు తెలియవంటూ మొన్నటి వరకూ గగ్గోలు పెట్టిన చంద్రబాబునాయుడు, ఇప్పుడు ఓ క్లారిటీకి వచ్చారని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు. అన్ని వర్గాల ప్రజలు తమకు దూరమవ్వడం వల్లే తాము ఎన్నికల్లో ఓడిపోయామని చంద్రబాబునాయుడు అన్నారు. ఇదే విషయాన్ని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా పంచుకుంటూ.. ఇన్నాళ్లకు చంద్రబాబుకు ఓటమిపై క్లారిటీ వచ్చిందని ఎద్దేవా చేశారు.