సీఎం జగన్ కు చంద్రబాబు లేఖ

సీఎం జగన్ కు చంద్రబాబు లేఖ

అమ‌రావ‌తి: టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు బుధవారం ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి లేఖ రాశారు. అమరావతిలోని ప్రజావేదికను ప్రతిపక్ష నేత అయిన తనకు కేటాయించాలని లేఖలో కోరారు. తన నివాసానికి అనుబంధంగా ప్రజావేదికను కేటాయించాలని అందులో విజ్ఞప్తి చేశారు. ఇప్పుడు తాను ఉన్న నివాసంలోనే కొనసాగాలని అనుకుంటున్నట్లు చెప్పారు. ప్రస్తుతం ఉంటున్న ఇంటిని యాజమాన్యం షరతుల మేరకు వినియోగించుకుంటానని చంద్రబాబు తెలిపారు.

తనను కలుసుకునేందుకు ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు, ప్రజలు వస్తుంటారనీ, కాబట్టి పక్కనే ఉన్న ప్రజావేదికను అధికారిక కార్యక్రమాల కోసం వినియోగించుకునేందుకు అనుమతి ఇవ్వాలని లేఖలో కోరారు. కాగా, ఈ లేఖ విషయమై ఏపీ ప్రభుత్వం ఇంతవరకూ స్పందించలేదు.