ఏపీలో నిరంకుశ పాలన.. ప్రశ్నిస్తే ప్రాణాలు పోతున్నయ్: చంద్రబాబు

ఏపీలో నిరంకుశ పాలన.. ప్రశ్నిస్తే ప్రాణాలు పోతున్నయ్: చంద్రబాబు

వైసీపీ ప్రభుత్వంలో పాలకుల అక్రమాలు బయటపెడితే ప్రాణాలు పోయే పరిస్థితి ఉందని అన్నారు ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. చీరాల విలేఖరి నాగార్జున రెడ్డిపై వైసీపీ నేతలు చేసిన దాడి అమానుమషని ఆయన ట్వీట్ చేశారు. అక్రమాలు బయటపెడితే కక్షగడతారా అని టీడీపీ అధినేత ప్రశ్నించారు. ఎస్పీకి వినతి పత్రం ఇచ్చి వస్తుంటే దాడి చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారని మండిపడ్డారు. ఆంధ్ర ప్రదేశ్ లో నిరంకుశ పాలన సాగుతోందన్నారు చంద్రబాబు.