హైకోర్టులో చంద్రబాబుకు ఎదురు దెబ్బ : క్వాష్ పిటీషన్ కొట్టివేత

హైకోర్టులో చంద్రబాబుకు ఎదురు దెబ్బ : క్వాష్ పిటీషన్ కొట్టివేత

ఏపీ మాజీ సీఎం చంద్రబాబుకు హైకోర్టు చుక్కెదురు అయ్యింది. స్కిల్ డెవలప్ మెంట్ స్కాంలో తనపై పోలీసులు పెట్టిన కేసును రద్దు చేయాలంటూ దాఖలు చేసిన క్వాష్ పిటీషన్ ను కొట్టివేసింది. సీఆర్ పీసీ సెక్షన్ 482 ప్రకారం.. నాపై దాఖలైన అభియోలు తప్పు.. పోలీసులు కావాలని చేశారు.. కేసు నుంచి నన్ను విముక్తి కల్పిస్తూ.. పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ రద్దు చేయాలని కోరుతూ.. ఏపీ హైకోర్టులో మాజీ సీఎం చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటీషన్ ను.. కొట్టివేసింది హైకోర్టు. క్వాష్ పిటీషన్ పై సుదీర్ఘమైన వాదనలు విన్న హైకోర్టు జడ్జీలు.. చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటీషన్ ను తిరస్కరించింది.

క్వాష్ పిటీషన్ పై విచారణ సమయంలో సీఐడీ, చంద్రబాబు తరపు లాయర్ల మధ్య వాదనలు గట్టిగా సాగాయి. చివరకు సీఐడీ తరపు లాయర్ల వాదనతో ఏకీభవించిన హైకోర్టు.. చంద్రబాబు దాఖలు చేసిన పిటీషన్ ను కొట్టివేసింది.

చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటీషన్ హైకోర్టు కొట్టివేయటంతో.. స్కిల్ డెవలప్ మెంట్ స్కాంలో చంద్రబాబు విచారణకు లైన్ క్లియర్ అయ్యింది. హైకోర్టు ఆదేశాలతో సీఐడీ దాఖలు చేసిన కస్టడీ పిటీషన్ సైతం విచారణకు రానుంది. సీఐడీ కస్టడీ పిటీషన్ పై తీర్పు ఎలా వస్తుంది అనేది కూడా ఆసక్తి రేపుతోంది.

ALSO READ : నీటిలో మునిగిపోయిన లింగంపల్లి రైల్వే అండర్ పాస్ బ్రిడ్జి.. ఇబ్బందుల్లో వాహనదారులు

సెప్టెంబర్ 22వ తేదీ ఉదయం చంద్రబాబు రిమాండ్ ను రెండు రోజులు పొడిగించింది ఏసీబీ కోర్డు. ఆ వెంటనే క్వాష్ పిటీషన్ సైతం కొట్టివేయటంతో.. ఇప్పుడు కస్టడీ పిటీషన్ తోపాటు బెయిల్ పిటీషన్లపై విచారణ, తీర్పు అనేది ఆసక్తి రేపుతున్నాయి.