తడిచిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనాలి.. ఏపీ సర్కార్ కు చంద్రబాబు అల్టిమేటం   

తడిచిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనాలి.. ఏపీ సర్కార్ కు చంద్రబాబు అల్టిమేటం   

ఏపీ ప్రభుత్వానికి డెడ్ లైన్ విధించారు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు. ధాన్యం కొనుగోలు కోసం సోమవారం( మే8)  సాయంత్రం లోపు ప్రభుత్వం ముందుకు రావాలని డిమాండ్ చేసారు. ప్రభుత్వానికి విధించిన డెడ్‌లైన్‌ పూర్తి కాగానే పాడైపోయిన మొత్తం ధాన్యాన్ని ట్రాక్టర్లు, లారీలకు ఎక్కించి తాడేపల్లి జగన్‌ ప్యాలెస్ కు పంపిద్దామంటూ అల్టిమేటం జారీ చేశారు. జగన్‌ అప్పటికీ బయటకు రాకపోయినా, మనల్ని తాడేపల్లి ప్యాలెస్కు రానీయకపోయినా.. ఆయనను శాశ్వతంగా బయటకు రానీయవద్దని, ఆ బాధ్యత రైతులే తీసుకోవాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.

ప్రభుత్వ తీరుతో రైతులకు నష్టం


ధాన్యం కొనుగోలు ఓ పెద్ద స్కామ్‌ అని, రైతుల నుంచి మిల్లర్లు దోచిందంతా జగన్‌ తాడేపల్లి ప్యాలెస్‌కు చేరుతోందని ఆగ్రహించారు. ప్రభుత్వ తీరు కారణంగా రైతులు నష్టపోయారని ఆరోపించారు. తడిచి పాడైపోయిన ధాన్యం కొనేవారులేక రైతులు కుమిలిపోతున్నారని పేర్కొన్నారు.ఆర్‌బీకేలలో ఎఫ్‌పీవో పొందిన తర్వాత రైతు ఏ మిల్లుకూ వెళ్లకూడదని....21 రోజుల్లోనే రైతు ఖాతాల్లో డబ్బు పడుతుందని జగన్‌ ప్రభుత్వమే నిబంధనలు పెట్టిందని చెప్పుకొచ్చారు. ప్రతీ మిల్లు వద్ద నూకలు, రవాణా చార్జీలు, హమాలీల కూలీల పేరుతో రైతుల నుంచి ఎదురుకట్నం మాదిరిగా ఎదురు డబ్బులు తీసుకుంటున్నా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని చంద్రబాబు ప్రశ్నించారు