ఎల్బీనగర్ మెట్రో స్టేషన్ వద్ద చంద్రబాబు మద్దతుదారుల ధర్నా

ఎల్బీనగర్ మెట్రో స్టేషన్ వద్ద  చంద్రబాబు మద్దతుదారుల ధర్నా

ఎల్ బీనగర్, వెలుగు :  చంద్రబాబు అరెస్ట్​ను నిరసిస్తూ ఐటీ ఎంప్లాయీస్, చంద్రబాబు మద్దతుదారులు శనివారం ‘లెట్స్ మెట్రో ఫర్ సీబీఎన్’ పేరుతో నిరసన కార్యక్రమం చేపట్టారు. మియాపూర్ నుంచి ఎల్బీనగర్ దాకా నల్ల దుస్తులు ధరించి మెట్రోలో ప్రయాణించారు. ఎల్బీనగర్ మెట్రో స్టేషన్​లో దిగిన నిరసనకారులు.. బయటికొచ్చి రోడ్డుపై ఆందోళన చేపట్టారు. 

ఎల్బీనగర్ వైపు ర్యాలీగా వెళ్తున్న వీరిని ఇండోర్ స్టేడియం వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీంతో నిరసనకారులు, పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది. కొందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దిల్​సుఖ్​నగ ర్ వైపు వెళ్తున్న మరికొంత మంది నిరసనకారులను పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు. 

ఈ సందర్భంగా వారు మాట్లాడు తూ.. బాబు అరెస్ట్ బాధాకరమన్నారు. శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే.. పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారని విమర్శించారు. ఇలా చేస్తే తెలంగాణలో కేసీఆర్​కు ఓటమి తప్పదని హెచ్చరించారు. నిరసన కార్యక్రమంలో తాటికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి పాల్గొన్నారు. ఆమెను పోలీసులు అరెస్ట్ చేసి ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్​కు తరలించారు. కొద్దిసేపు మియాపూర్, ఎల్బీనగర్ మధ్య మెట్రో సేవలు నిలిచిపోయాయి.