వినాయక చవితికి చంద్రముఖి 2 రిలీజ్..

వినాయక చవితికి చంద్రముఖి 2 రిలీజ్..

‘కాంచన’ సిరీస్‌‌తో హారర్ కామెడీ మూవీస్‌‌కి కేరాఫ్‌‌గా నిలిచిన  లారెన్స్‌‌.. త్వరలో ‘చంద్రముఖి 2’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.  పి.వాసు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది. గణేష్ చతుర్థి కానుకగా సెప్టెంబర్ 19న ఈ సినిమాని రిలీజ్ చేయనున్నట్టు గురువారం ప్రకటించారు. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లోనూ విడుదల కానుందని అనౌన్స్ చేశారు.

కంగనా రనౌత్, లక్ష్మీ మీనన్ హీరోయిన్స్‌‌గా నటిస్తున్న ఈ చిత్రంలో రాధికా శరత్ కుమార్, వడివేలు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. రజినీకాంత్ నటించిన చిత్రానికి సీక్వెల్‌‌ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.