చంద్రయాన్-3 ల్యాండింగ్.. విద్యార్థులు లైవ్ చూడొచ్చు

చంద్రయాన్-3 ల్యాండింగ్.. విద్యార్థులు లైవ్ చూడొచ్చు

ఆగస్టు  23న చంద్రయాన్ 3 సేఫ్ ల్యాడింగ్ అవుతున్న సందర్భంగా తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది.   అన్ని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు చూసేలా బడుల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని  డీఈవోలు , స్కూల్ ప్రిన్సిపాల్స్ కు ఆదేశాలు జారీ చేశారు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ దేవసేన.

ఆగస్టు 23 సాయంత్రం 5.30 గంటలకు  T SAT నిపుణ  చంద్రయాన్ సెఫ్ ల్యాడింగ్ లైవ్ టెలికాస్ట్ చేస్తుందని అన్ని  పాఠశాలలో విద్యార్థులు ప్రత్యక్ష ప్రసారం చూసేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.  

దేశంలోని విద్యార్థులందరు చంద్రయాన్ సెఫ్ ల్యాడింగ్ చూసేల్ అన్ని విద్యా సంస్థలు ఏర్పాట్లు చేయాలన్న  ఇస్రో విజ్ఞప్తి మేరకు అన్ని  పాఠశాలలకు ఆదేశాలు జారీ చేశారు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చేపట్టిన ప్రతిష్ఠాత్మక చంద్రయాన్‌-3 కీలక దశకు చేరుకుంది. ల్యాండర్‌ మాడ్యూల్‌.. చందమామకు మరింత చేరువైంది. ప్రొపల్షన్ మాడ్యుల్ నుంచి ఇప్పటికే విడిపోయిన విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ ప్రస్తుతం.. చంద్రుడి చుట్టూ పరిభ్రమిస్తున్నాయి.