సౌతాఫ్రికా నుంచి చంద్ర‌యాన్ 3 లైవ్ చూడ‌నున్న మోదీ.

సౌతాఫ్రికా నుంచి చంద్ర‌యాన్ 3 లైవ్ చూడ‌నున్న మోదీ.

మరికొద్ది గంటల్లో అంతరిక్షంలో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. చంద్రుడి దక్షిణ ధృవంపై చంద్రయాన్3 సాఫ్ట్ ల్యాండింగ్కు సిద్ధమైంది. సాయంంత్రం 5.47 గంటలకు సాఫ్ట్ ల్యాండింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. సాయంత్రం 6.04 గంటలకు ఆర్టిట్ నుంచి ల్యాండర్ విడిపోయి జాబిల్లిపై దిగనుంది. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ సౌతాఫ్రికా నుంచి భాగస్వాములవుతారు. 

ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోదీ సౌతాఫ్రికాలోని జొహెన్నెస్ బర్గ్ లో పర్యటిస్తున్నారు. 15వ బ్రిక్స్ సమావేశాల్లో పాల్గొంటున్నారు. అయితే ఆగస్టు 23వ తేదీ సాయంత్రం చంద్రయాన్ 3 చంద్రుడి దక్షిణ ధృవంపై దిగనుంది. ఈ అద్భుత దృశ్యాన్ని  ఇస్రో లైవ్ టెలీకాస్ట్ చేయనుంది. అయితే ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ గా పాల్గొంటారని   కేంద్ర ప్రభుత్వం తెలిపింది. 

 చంద్రయాన్ -3 యొక్క ల్యాండర్ మాడ్యూల్ (ఎల్‌ఎమ్) ఆగస్టు 23వ తేదీ బుధవారం సాయంత్రం చంద్రుని ఉపరితలంపై ల్యాండ్ అవనుంది. చంద్రయాన్ 3 చంద్రుడి దక్షిణ ధ్రువాన్ని చేరుకుంటే సాఫ్ట్-ల్యాండింగ్ సాంకేతికతను సాధించిన నాల్గవ దేశంగా భారతదేశం నిలుస్తుంది. ఇప్పటి వరకు అమెరికా,  చైనా,  పూర్వపు సోవియట్ యూనియన్  మాత్రమే చంద్రునిపై సాఫ్ట్ ల్యాండింగ్ సాంకేతికను సాధించాయి.