చందూ ఛాంపియన్..ఫస్ట్ లుక్ పోస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విడుదల

చందూ ఛాంపియన్..ఫస్ట్ లుక్ పోస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విడుదల

కార్తీక్ ఆర్యన్ హీరోగా తెరకెక్కుతున్న స్పోర్ట్స్ డ్రామా ‘చందూ ఛాంపియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’. బజరంగీ భాయిజాన్, ఏక్ థా టైగర్ చిత్రాల దర్శకుడు కబీర్ ఖాన్ దీన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. జూన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సినిమా విడుదల కానున్న నేపథ్యంలో ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన మేకర్స్ బుధవారం ఫస్ట్ లుక్ పోస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను విడుదల చేశారు. అథ్లెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా కార్తిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లుక్ ఆకట్టుకుంది.  పారాలింపిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మన దేశానికి మొదటి బంగారు పతకం సాధించిన  మురళీకాంత్ పేట్కర్ జీవితం ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోంది.

1965 ఇండో – పాక్ యుద్ధంలో తీవ్రంగా గాయపడి అంగ వైకల్యానికి గురైన ఆయన, 1972లో జరిగిన ప్రపంచ పారాలింపిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పాల్గొని, స్విమ్మింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో గోల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మెడల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను సాధించారు. ఆయన జీవితం స్ఫూర్తిగా దీన్ని తెరకెక్కించారు. సాజిద్ నడియడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వాలా నిర్మిస్తున్న ఈ చిత్రం జూన్ 14న విడుదల కానుంది.