తండేల్ అంటే ఇంత అర్ధం ఉందా..ఆసక్తి విషయాలతో చందూ మొండేటి

తండేల్ అంటే ఇంత అర్ధం ఉందా..ఆసక్తి విషయాలతో చందూ మొండేటి

అక్కినేని నాగ చైతన్య (Naga Chaitanya) హీరోగా టాలెంటెడ్ దర్శకుడు చందు మొండేటి (Chandu mondeti) కాంబోలో తెరకెక్కుతున్న మూవీ తండేల్(Thandel). పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాను గీతా ఆర్ట్స్ సంస్థపై అల్లు అరవింద్ నిర్మిస్తుండగా..నేచురల్ బ్యూటీ సాయి పల్లవి (Sai Pallavi) హీరోయిన్గా నటిస్తోంది.

లేటెస్ట్గా ఓ ఇంటర్వ్యూలో చందూ మొండేటి తండేల్ టైటిల్ వెనుక ఉన్న అర్దాన్ని వివరించాడు. తండేల్ అంటే గుజరాతీలో 'బోట్ ఆపరేటర్' అని చెప్పేశాడు. ఈ తండేల్ అనే పదాన్ని..గతంలో గుజరాత్-పాకిస్థాన్ సరిహద్దుల్లోని కుగ్రామాల్లోఎక్కువగా ఈ పదాన్ని పలికేవారని తెలిపారు.

అలాగే తండేల్ అంటే..నాయకుడు, కెప్టెన్ అట. ఎలాంటి భయం, బెరుకు లేనివాడు అని అలాంటి యోధుడినే తండేల్ అంటరాని తెలుస్తుంది.అంతేకాకుండా  మరికొన్ని అర్ధాలు ఉంటాయని చెప్పారు.  శక్తివంతమైన, ఆకర్షణీయమైన, ఏకాగ్రత అని అర్ధం.మరి తండేల్ ఎలా ఆకట్టు కుంటుందో చూడాలి.

ఈ సినిమా కోసం చై తండేల్గా కనిపించేందుకు..గత ఆరు నెలలుగా చాలా కష్టపడుతున్నాడని చందూ వెల్లడించాడు. రీసెంట్గా శ్రీకాకుళంలోని మత్స్యలేశం గ్రామాన్ని సందర్శించిన చై..అక్కడ స్థానిక మత్స్యకారులతో ముచ్చ‌టించి, వారి బాడీ లాంగ్వేజ్‌ని పరిశీలించారు. అలా శ్రీకాకుళం మాండలికం..వారి యాస..భాష పై..పట్టు సాధించడంతో పాటు మత్స్యకారుల బాడీ లాంగ్వేజ్‌ను తన పరిధిలోకే తెచ్చుకుంటున్నట్లు వివరించారు.

ఇప్పటికే తన జుట్టు గడ్డం పెంచడమే కాకుండా, చై తన శరీరాన్ని పెంచుకోవడానికి జిమ్‌కు కూడా వెళుతున్నాడు..ఇందులో కొత్త చెతన్య నే కాదు..సరికొత్త నాగ చైతన్య ను చూస్తారంటూ ఆశాభావం వ్యక్తం చేశాడు.