సీజేఐ యాదాద్రి పర్యటనలో మార్పు

సీజేఐ యాదాద్రి పర్యటనలో మార్పు

హైదరాబాద్: సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ యాదాద్రి పర్యటనలో స్వల్ప మార్పు చోటుచేసుకుంది. సోమవారం ఎన్వీ రమణ తండ్రి తిథి కావడంతో పర్యటన వాయిదా వేశారు. ఎల్లుండి యాదాద్రిని సీజేఐ సందర్శించనున్నారు. షెడ్యూల్ ప్రకారం ఆయితే సోమవారం యాదాద్రిని దర్శించుకోవాలనుకున్నారు. భారత న్యాయమూర్తి హోదాలో మొదటిసారి యాదాద్రిని ఎన్వీ రమణ దర్శించుకోనున్నారు. సీజేఐ హోదాలో వస్తుండటంతో ఘనంగా స్వాగతం పలికేందుకు ఆలయ సిబ్బంది ఏర్పాట్లు చేస్తోంది. సీఎం కేసీఆర్‌ ఆలయ పునర్నిర్మాణ తీరును స్వయంగా జస్టిస్‌ ఎన్వీ రమణకు వివరించనున్నారు.

అంతకుముందు యాదాద్రి ఆలయం సందర్శనకు రావాల్సిందిగా జస్టిస్‌ ఎన్వీ రమణను కేసీఆర్ ఆహ్వానించారు. యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ వైభవాన్ని కేసీఆర్, సీజేఐకి వివరించారు. రాజుల కాలం తర్వాత ఆధునిక కాలంలో దేశంలో ఎక్కడా లేని విధంగా కృష్ణరాతి శిలలతో నిర్మితమైన ఆలయాన్ని సందర్శించాలని కోరినట్టుగా తెలిసింది. సీఎం కేసీఆర్‌ అభ్యర్థనకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ సానుకూలంగా స్పందించారు.