ఆధ్యాత్మిక సభలతోనే మార్పు

V6 Velugu Posted on Feb 07, 2021

యాదాద్రి భువనగిరి జిల్లా, వెలుగు : తల్లిదండ్రులను సుఖపెట్టే వారే నిజమైన కొడుకులు అన్నారు ప్రముఖ కవి ఆచార్య మసన చెన్నప్ప. శనివారం భువనగిరి మండలంలోని వీరవెల్లి గ్రామంలో జరిగిన కస్తూరి అంజన్ దాస్ 16వ వార్షికోత్సవం సందర్భంగా జరిగిన ఆధ్యాత్మిక సభలో పాల్గొని మాట్లాడారు చెన్నప్ప. ప్రస్తుత రోజుల్లో కొందరు కొడుకులు ఆస్తులు పంచుకొని, తల్లిదండ్రులను లెక్క చేయడం లేదని తెలిపారు. ఇలాంటి ఆధ్యాత్మిక సభలో తోనైనా మార్పు రావాలని కోరారు.

ఈ కార్యక్రమంలో సర్పంచ్ కల్పనా శ్రీనివాస్ చారి, వేదశ్రీ, నిత్యానంద, వేదానంద, సూర్యప్రకాశానంద, సాహీతీ వేత్తలు డాక్టర్. ఎడ్లపల్లి మోహన్ రావు, సోమ సీతారాములు, చెన్న కిష్టయ్య, గడ్డం నర్సింహ, మెరుగు సదానందం, ఆర్మీ శ్రీనివాస్, జర్నలిస్ట్ వేమనకృష్ణ,  కస్తూరి రాజారాం, లక్ష్మీనారాయణ, యాదగిరి, వెంకన్న , పలువురు కవులు, రచయితలు, సాధువులు పాల్గొని ప్రసంగించారు. అనంతరం గ్రామస్థులకు అన్నదానం, వస్త్రదానం, పుస్తకాలు పంపిణీ చేశారు నిర్వాహకులు.

Tagged yadadribhuvanagiri, acharya masana chennappa, veeravelly

Latest Videos

Subscribe Now

More News