హైదరాబాద్, వెలుగు: జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్ల బాధ్యతల్లో పలు మార్పులు చేస్తూ కమిషనర్ ఆమ్రపాలి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. సికింద్రాబాద్ జోనల్ కమిషనర్, హెల్త్ అడిషనల్కమిషనర్ గా కొనసాగుతున్న రవికిరణ్‌ను శానిటేషన్, ట్రాన్స్‌పోర్టేషన్ అడిషనల్ కమిషనర్ గా బాధ్యతలు అప్పగించారు. హెల్త్డిపార్ట్మెంట్నుంచి రిలీవ్చేశారు. శానిటేషన్ అడిషనల్ కమిషనర్ గా, శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ గా పనిచేస్తున్న ఉపేందర్‌రెడ్డికి అడిషనల్ కమిషనర్బాధ్యతలు తప్పించారు. ఎల్బీనగర్ జోనల్ కమిషనర్‌గా పనిచేసి రిలీవ్ అయిన ఎస్.పంకజకు హెల్త్ అడిషనల్ కమిషనర్ గా బాధ్యతలు అప్పగించారు. లీగల్, ఎలక్ట్రికల్ అడిషనల్ కమిషనర్ సత్యనారయణకు అడ్వటైజ్ మెంట్ బాధ్యతలు అప్పగించారు.
