
హైదరాబాద్, వెలుగు : భారీ వర్షాలు, వరదల కారణంగా స్టాఫ్ నర్స్ ఎగ్జామ్ సెంటర్లలో తెలంగాణ మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు స్వల్ప మార్పులు చేసింది. ఖమ్మంలోని పరీక్షా కేంద్రాలను మార్చినట్టు ఆదివారం ఓ ప్రకటనలో బోర్డు తెలిపింది. తొలి షెడ్యూల్ సెషన్ 1, 2, 3 ప్రకారం ప్రియదర్శిని ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫర్ విమెన్ సెంటర్లో జరగాల్సిన పరీక్షలను.. స్వర్ణ భారతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ టెక్నాలజీ, ఖమ్మం ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కేంద్రాల్లోకి మార్చినట్టు బోర్డు వెల్లడించింది.
టైమింగ్స్‌లో మాత్రం ఎలాంటి మార్పుల్లేవని స్పష్టం చేసింది. ఆగస్టు 2న స్టాఫ్ నర్స్ రిక్రూట్మెంట్ ఎగ్జామ్ జరగనుంది. రాష్ట్రవ్యాప్తంగా 40 సెంటర్లను ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌లో 24, ఖమ్మంలో 6, నిజామాబాద్‌లో 2, వరంగల్‌లో 8 పరీక్షా కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. 5,204 పోస్టులకు మొత్తం 40,936 మంది అప్లై చేసుకున్నారు. సెషన్1 పరీక్షకు రిపోర్టింగ్ టైం ఉదయం 7.30. సెషన్ 2 ఉదయం11 గంటలు, సెషన్3 మధ్యాహ్నం 2.30 గా పేర్కొన్నారు.