V6 News

త్వరలో టెక్నికల్ ఎడ్యుకేషన్ లో మార్పులు...

త్వరలో టెక్నికల్ ఎడ్యుకేషన్ లో మార్పులు...

జేఎన్టీయూ పరిధిలో సిలబస్ మారనుందని జేఎన్టీయూ వైస్ ఛాన్స్ లర్ వెంకట నర్సింహారెడ్డి వెల్లడించారు. అంతే కాకుండా త్వరలో టెక్నికల్ ఎడ్యుకేషన్ లో మార్పులు తీసుకొస్తాని తెలిపారు. రెండు వారాల్లో కొత్త సిలబస్, టెక్నికల్ ఎడ్యుకేషన్ లో మార్పులు వెల్లడిస్తామన్న వీసీ స్పష్టం చేశారు. నెలాఖరుకు కాలేజీల అఫ్లియేషన్లు పూర్తి అవుతాయన్న వెంకట నర్సింహారెడ్డి.. ప్రైవేటు కాలేజీల్లో 1:2:4 ప్రకారం ఫ్యాకల్టీని నియమిస్తామని చెప్పారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కి కొత్తగా 20 కేంద్రాలు  ఏర్పాటు చేశామని తెలిపారు. కొత్తగా AIML కోర్సు ప్రవేశపెడుతున్నామని JNTU వీసీ అన్నారు. ఈ కొత్త కోర్సు హైదరాబాద్ సుల్తానా పూర్ JNTU లలో అందుబాటులోకి తెస్తామని స్పష్టం చేశారు.

ఇదిలా ఉండగా నేడు టీఎస్ ఎంసెట్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్ పరీక్షా ఫలితాలను కూకట్పల్లిలోని జెఎన్టీయూహెచ్లో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి విడుదల చేశారు. కాగా ఈ ఏడాది ఎంసెట్ ఇంజనీరింగ్ విభాగంగా లక్ష్మీసాయి లోహిత్ రెడ్డి ఫస్ట్ ర్యాంక్ సాధించగా.. సాయి దీపిక సెకండ్, కార్తికేయ థర్డ్ ప్లేస్ లో నిలిచారు. ఇక అగ్రికల్చర్ విభాగంలో నేహాకు ఫస్ట్ ర్యాంక్ రాగా.. రోహిత్ సెకండ్ ర్యాంక్ సాధించారు. ఎంసెట్ లో క్వాలిఫై అయిన విద్యా్ర్థులకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. త్వరలోనే కౌన్సిలింగ్ నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఎంసెట్ కౌన్సెలింగ్ సెంటర్లలో కాలేజీల వివరాలు తెలుసుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు.