V6 News

బర్త్ డే ట్రీట్.. బాలు పాత్రలో బ్రహ్మాజీ

 బర్త్ డే ట్రీట్.. బాలు పాత్రలో బ్రహ్మాజీ

విభిన్న పాత్రలు పోషిస్తూ నటుడిగా ఆయనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు బ్రహ్మాజీ.  దాదాపు 36 ఏళ్ల సినీ ప్రయాణంలో ఎన్నో  పాత్రలు పోషించారు. శనివారం ఆయన పుట్టిన రోజు. ఈ సందర్భంగా  బ్రహ్మాజీ క్యారెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను పరిచయం చేస్తూ బర్త్‌‌‌‌‌‌‌‌డే విషెస్ తెలియజేసింది ‘శ్రీనివాస మంగాపురం’ మూవీ టీమ్. ఈ చిత్రంలో ఆయన బాలు పాత్రలో కనిపించనున్నట్టు రివీల్ చేశారు.

 కూలింగ్ గ్లాసెస్ పెట్టుకుని,  చేతిలో మైక్‌‌‌‌‌‌‌‌తో ఆర్కెస్ట్రా వాయిస్తూ కనిపిస్తున్న  తన పోస్టర్ ఆకట్టుకుంది.  మహేష్ బాబు అన్న కొడుకు జయకృష్ణ ఘట్టమనేని, రవీనా టాండన్ కూతురు రాషా తడాని జంటగా ‘ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎక్స్‌‌‌‌‌‌‌‌ 100’ ఫేమ్ అజయ్ భూపతి ఈ చిత్రాన్ని  రూపొందిస్తున్నాడు. మోహన్ బాబు,  వీకే నరేష్​ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అశ్వనీదత్ సమర్పణలో  పి. కిరణ్ నిర్మిస్తున్నారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు.