వరుణ్ ధావన్ హీరోగా రూపొందుతున్న చిత్రం ‘హై జవానీ తో ఇష్క్ హోనా హై’. ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌లో పూజాహెగ్డే, మృణాల్ ఠాకూర్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. కామెడీ సినిమాల స్పెషలిస్ట్ డేవిడ్ ధావన్ దర్శకత్వం వహిస్తున్నారు. రమేష్ తౌరాణి నిర్మిస్తున్నారు. ఇప్పటికే టీజర్‌తో పాటు ‘వ్యాహ్ కర్వాదో జీ’ అనే పాటను విడుదల చేశారు. తాజాగాఈ చిత్రం నుంచి ‘వావ్’ అనే స్పెషల్ సాంగ్‌ను విడుదల చేశారు.
కలర్‌ఫుల్ విజువల్స్, అదిరిపోయే కొరియోగ్రఫీతో ఈ సాంగ్ ఫుల్ ఎనర్జిటిక్‌గా సాగింది. ముఖ్యంగా వరుణ్ మార్క్ డ్యాన్స్ మూమెంట్స్, పూజాహెగ్డే, మృణాల్ ఠాకూర్ గ్లామర్ ఈ పాటకి ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. తనిష్క్ బగ్చి, రోనీ అజ్నాలీ, గిల్ మచ్ రాయ్ కంపోజ్ చేసిన ట్యూన్ వినగానే స్టెప్పులేయించేలా ఉంది. హార్డీ సంధు, కిరణ్ బజ్వా వోకల్స్ ఈ పాటకు ఫ్రెష్‌నెస్ తీసుకొచ్చాయి. మోడ్రన్ బీట్స్‌తో కూడిన ఈ హుషారైన పాట పార్టీ ఆంథమ్‌గా యూత్‌ను ఇంప్రెస్ చేస్తోంది. మే 22న సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

