ప్రాపర్టీ సర్వేలో ఇంటికి రూ.50 వసూలు

ప్రాపర్టీ సర్వేలో ఇంటికి రూ.50 వసూలు

కారేపల్లి, వెలుగు: ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం గుంపళ్లగూడెంలో శుక్రవారం ప్రాపర్టీ సర్వే చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తుల నుంచి ఇంటికి రూ.50 చొప్పున వసూలు చేయడం విమర్శలకు దారితీసింది. పంచాయతీ కార్యదర్శి బానోత్ నగేశ్​తో పాటు మల్టీ పర్పస్​వర్కర్, మరో వ్యక్తి కలిసి ప్రతి ఇంటిని సర్వే చేశారని గ్రామస్తులు చెప్పారు. ఈ సమయంలో పేదలు, వృద్ధుల నుంచి కూడా రూ.50 చొప్పున తీసుకున్నారని ఆరోపించారు. దీనిపై కార్యదర్శి నగేశ్​​ వివరణ కోరగా కొందరు ప్రైవేట్ సర్వే చేయించుకున్నారని, దానికి డబ్బులు తీసుకొని ఉండవచ్చని సమాధానమిచ్చారు. ఈ విషయమై ఎంపీడీవో మాచర్ల రమాదేవి మాట్లాడుతూ డబ్బులు వసూలు చేసిన విషయం తమ దృష్టికి రాలేదని, గ్రామస్తులు ఫిర్యాదు చేస్తే విచారణ జరిపి బాధ్యులపై చర్య తీసుకుంటామని చెప్పారు.

For More News..

కేసీఆర్ తర్వాత నేనే: మంత్రి ఎర్రబెల్లి

టీఆర్ఎస్ లీడర్లకు ‘ఎమ్మెల్సీ’ టార్గెట్లు

కరోనా పేషెంట్​కు ఇంట్లోనే డెలివరీ