మావోయిస్టుల దాడిలో గాయపడ్డ మాజీ సర్పంచ్‌‌‌‌ మృతి.. 33 నెలలు కోమాలో..

మావోయిస్టుల దాడిలో గాయపడ్డ మాజీ సర్పంచ్‌‌‌‌ మృతి.. 33 నెలలు కోమాలో..

భద్రాచలం, వెలుగు: నక్సల్స్‌‌‌‌ దాడిలో తీవ్రంగా గాయపడి కోమాలోకి వెళ్లిన ఓ మాజీ సర్పంచ్‌‌‌‌ 33 నెలల తర్వాత మృతిచెందాడు. పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం.. ఛత్తీస్​గఢ్​ రాష్ట్రం బీజాపూర్‌‌‌‌ జిల్లా ఫర్సేగఢ్‌‌‌‌ గ్రామపంచాయతీ మాజీ సర్పంచ్‌‌‌‌ గోటా మహేశ్​ను 2023 ఆగస్టులో మావోయిస్టులు కిడ్నాప్‌‌‌‌ చేసి తీవ్రంగా కొట్టి రెండు రోజుల తర్వాత కుట్రూ–ఫర్సేగఢ్‌‌‌‌ మార్గంలో వదిలేశారు.

 అపస్మారక స్థితిలో ఉన్న ఆయనను కుటుంబ సభ్యులు హాస్పిటల్​కు తరలించగా, కోమాలోకి వెళ్లినట్లు డాక్టర్లు నిర్ధారించారు. మెరుగైన చికిత్స కోసం రాయ్‌‌‌‌పూర్‌‌‌‌, ఢిల్లీ సహా పలు ఆసుపత్రులకు తరలించినప్పటికీ ఆయన ఆరోగ్యం కుదుటపడలేదు. చివరికి సోమవారం ఆయన తుదిశ్వాస విడిచారు. మహేశ్​ తండ్రి గోటా చెన్నారాంను కూడా 2012లో మావోయిస్టులు కాల్చి చంపేశారు.