మొన్న ఘన్సిమియాగూడ..నిన్న శంకరపురంలో చిరుత సంచారం

మొన్న ఘన్సిమియాగూడ..నిన్న శంకరపురంలో చిరుత సంచారం
  • ట్రాప్ ​బోన్లు ఏర్పాటు.. కొనసాగుతున్న గాలింపు

శంషాబాద్, వెలుగు: శంషాబాద్ మండలంలో చిరుత పులి సంచరిస్తోంది. శనివారం అర్ధరాత్రి ఘన్సిమియాగూడ పరిసరాల్లో తిరుగుతూ రెండు లేగ దూడలు, ఓ కుక్కపై దాడి చేసింది. ఆదివారం రాత్రి శంకరపురం గ్రామంలోని ఐఎంటీ కాలేజీ సమీపంలో తిరుగుతుండగా అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డ్​అయింది. విషయం తెలుసుకున్న అటవీశాఖ అధికారులు సోమవారం ఐదు ట్రాప్​ కెమెరాలు, బోన్లు ఏర్పాటు చేశారు. 

శంకరపురంతోపాటు సమీప గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. చిరుత సంచారంతో ఆయా గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇంటి నుంచి బయటకి రావాలంటే వణికి పోతున్నారు.