అలిపిరి నడక దారిలో చిరుత సంచారం

అలిపిరి నడక దారిలో చిరుత సంచారం

తిరుమల మెట్ల మార్గంలో వన్యమృగాలు విచ్చలవిడిగా తిరుగుతున్నాయి. ఇటీవల శ్రీవారి దర్శనానికి వెళ్తున్న ఓ చిన్నారిపై చిరుత దాడి చేసి హతమార్చిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి నిఘా పెంచిన పోలీసులు భక్తులు గుంపులుగా వెళ్లాలని సూచించింది. 

అధికారులు 400 ట్రాప్​ కెమెరాలు అమర్చగా.. చాలా చోట్ల బోన్లను ఏర్పాటు చేశారు. ఈ బోనుల్లో ఇప్పటికే 2 చిరుతలు చిక్కుకున్నాయి. అయితే ఆగస్టు 22 అర్ధరాత్రి 7వ మైలు దగ్గర మరో చిరుత కదలికను అధికారులు గుర్తించారు. 

చిరుతకు సంబంధించిన దృశ్యాలు కెమెరాలో రికార్డ్​అయ్యాయి. కెమెరాకు సమీపంలోనే బోను ఏర్పాటు చేసినా చిరుత చిక్కలేదు. దీంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఇంకా ఎన్ని చిరుతలు ఉన్నాయో తెలియక ఎప్పుడు దాడి చేస్తాయో అంతుపట్టక భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.