హైదరాబాద్‌కు చేరుకున్న చేగువేరా కూతురు

హైదరాబాద్‌కు చేరుకున్న చేగువేరా కూతురు

విప్లప యోధుడు చేగువేరా కూతురు డాక్టర్ అలైదా గువేరా కలకత్తా నుండి హైదరాబాద్‌లోని శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆమెతో పాటు చేగువేరా మనవరాలు ప్రొఫెసర్ ఎస్తే ఫానియా గువేరా కూడా నగరానికి వచ్చారు. ఎయిర్ పోర్టుకు చేరుకున్న వీరికి అధికారులు, ప్రజాసంఘాల నాయకులు కట్టుదిట్టమైన భద్రత నడుమ ఆహ్వానం పలికారు.

ఈ రోజు సాయంత్రం నాలుగు గంటలకు రవీంద్రభారతిలో జరిగే 'క్యూబా సంఘీభావ సభలో అలైదా గువేరా, ఎస్తే ఫానియా ముఖ్యఅతిధులుగా పాల్గొననున్నారు. ఈ సభలో బీజేపీ, ఎంఐఎం మినహా మిగతా పార్టీలకు చెందిన నేతలు కూడా పాల్గొనున్నట్టు సమాచారం.