
హ్యట్రిక్ విజయాల తర్వాత గత మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ చేతిలో కంగుతిన్న చెన్నై సూపర్‌కింగ్స్ ఆ ఓటమి నుంచి వెంటనే తేరుకుంది. డుప్లెసిస్ (38 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లతో 54)హాఫ్ సెంచరీకి తోడు వెటరన్ బౌలర్ హర్భజన్‌సింగ్ (4–1–17–2) అద్భుత బౌలింగ్ తో సత్తాచాటడంతో శనివారం సాయంత్రం జరిగినమ్యాచ్ లో 22 పరుగుల తేడాతో కింగ్స్ లెవెన్‌పంజాబ్ ను చిత్తుగా ఓడించింది. మొదటబ్యాటింగ్ చేసిన చెన్నై 20 ఓవర్లలో 3 వికెట్లకు160 పరుగులు చేసింది. డుప్లెసిస్ తో పాటు ఆఖర్లో మహేంద్ర సింగ్ ధోనీ (23 బంతుల్లో4 ఫోర్లు, 1 సిక్సర్ తో 37 నాటౌట్ ), అంబటిరాయుడు (15 బంతుల్లో 1ఫోర్ , 1సిక్సర్ తో21 నాటౌట్ ) రాణించారు. పంజాబ్ కెప్టెన్ ఆర్ .అశ్విన్ మూడు వికెట్లు పడగొట్టాడు. అనంతరం ఛేజింగ్ లో పంజాబ్ ఓవర్లన్నీ ఆడి ఐదు వికెట్లుకోల్పోయి 138 రన్స్ మాత్రమే చేసి ఓడిపోయింది.సర్ఫరాజ్ ఖాన్ (59 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్ల-తో 67), లోకేశ్ రాహుల్ (47 బంతుల్లో 3 ఫోర్లు,1 సిక్సర్ తో 55) అర్ధ సెంచరీలు చేసినా ఫలితంలేకపోయింది. హర్భజన్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌అవార్డు దక్కింది.
సర్ఫరాజ్ , లోకేశ్ పోరాడినా..
ఛేజింగ్ లో పంజాబ్ కు ఆరంభంలోనే భారీషాక్ తగిలింది. రెండో ఓవర్లోనే యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ (5), యువ కెరటం మయాంక్ అగర్వాల్ (0) ను ఔట్ చేసిన వెటరన్ స్పిన్నర్ హర్భజన్ ప్రత్యర్థిని దెబ్బకొట్టాడు. ఏడు రన్స్‌కే రెండు వికెట్లు కోల్పోయిన పంజాబ్ ఇన్నింగ్స్‌ను ఓపెనర్ లోకేశ్ , యువ ప్లేయర్ సర్ఫరాజ్ చక్కదిద్దారు. మూడో వికెట్ కు 110 పరుగులుజోడించి జట్టును గెలుపు దిశగా నడిపించారు.ఈ క్రమంలో ఇద్దరూ హాఫ్ సెంచరీలూ కూడాపూర్తి చేసుకున్నారు. కానీ, మిడిల్ ఓవర్లలో స్పిన్నర్ల బౌలింగ్ లో ఇద్దరూ రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడలేదు. అటువైపు భజ్జీతో పాటు జడేజా, తాహిర్ కూడా కట్టు దిట్టంగా బౌలింగ్ చేశారు. పిచ్ కూడా వారికి అనుకూలించడంతో ఆచితూచిఆడిన రాహుల్ , సర్ఫరాజ్ స్లాగ్ ఓవర్లలో పేసర్లవచ్చాక చెలరేగుదాం అనుకున్నట్టున్నారు. కానీ, ఆ నిర్ణయం బెడిసికొట్టింది. పేసర్లు వచ్చేటైమ్ కు సాధించాల్సిన రన్ రేట్ 16కు చేరుకోవడంతో ఒత్తిడి పెరిగింది. 18 బంతుల్లో 46 రన్స్ అవసరమైన దశలో మంచి ఆఫ్ కట్టర్ తో రాహుల్ నుఔట్ చేసిన కుగిలిన్ పంజాబ్ కు షాకిచ్చాడు.18వ ఓవర్లో వరుసగా రెండు నోబాల్స్ వేసినదీపక్ చహర్ చెన్నై శి బిరంలో ఆందోళన రేకెత్తిం చాడు. కానీ, మిగతా ఆరు బంతుల్లో ఐదుపరుగులే ఇవ్వడంతో పాటు లాస్ట్ బాల్ కు డేవిడ్‌మిల్లర్ (6)ను క్లీన్ బౌల్డ్ చేసి మ్యాచ్ ను తమవైపులాగేసుకున్నా డు. చివరి ఓవర్లో 26 రన్స్ అవసరమవగా సర్ఫరాజ్ ను బౌల్డ్ చేసిన కుగిలిన్ 3 రన్స్ మాత్రమే ఇచ్చి చెన్నైని గెలిపిం చాడు.
డుప్లెసిస్ మెరుపులు
తొలుత చెన్నై ఇన్నింగ్స్ మలుపులు తిరుగుతూసాగింది. ఓపెనర్లు షేన్ వాట్సన్ ( 24 బంతుల్లో3 ఫోర్లు, 1 సిక్సర్ తో 26), డుప్లెసిస్ ఫస్ట్ వికెట్ కు54 రన్స్ జోడించి శుభారంభం అందించారు. షమీ వేసిన మూడో ఓవర్లో రెండు ఫోర్లు, ఓ సిక్సర్ తో డుప్లెసిస్ తన ఉద్దేశం ఏమిటో చెప్పా డు.ఆపై, ఆండ్రూ టై బౌలింగ్ లో వాట్సన్ రెండు సిక్సర్లు, ఒక ఫోర్ బాదాడు. అయితే, ఊపు మీదున్నవాట్సన్ ను ఔట్ చేసిన కెప్టెన్ అశ్విన్ జోడీని విడదీశాడు. అతనితో పాటు మరో స్పిన్నర్ మురుగన్ అశ్విన్ (0/23) పొదుపుగా బౌలింగ్ చేయడంతో డుప్లెసిస్ , రైనా (17) కాసేపు జాగ్రత్తగా ఆడారు.కాసే పటికి గేర్ మార్ చిన డుప్లెసిస్ వెంట వెంటనే రెండు సిక్సర్లు కొట్టి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోవడంతో పాటు టీమ్ స్కోరు వంద దాటించాడు.కానీ, వరుస బంతుల్లో డుప్లెసిస్ , రైనాను ఔట్‌చేసిన అశ్విన్ హోమ్ టీమ్ కు షాకిచ్చాడు.ధోనీ, రాయుడు తొలుత నత్తనడక బ్యాటింగ్ చేయడంతో 17 ఓవర్లకు హోమ్ టీమ్ 116/3తోనిలిచింది. ఈ లెక్కన ధోనీసేన 150 దాటితేనే గొప్ప అనిపించింది. ఎట్టకేలకు ఆండ్రూ టై వేసిన18వ ఓవర్లో బౌండ్రీ కొట్టి మహీ వేగం పెంచాడు.ఆపై, కరన్ బౌలింగ్ లో డీప్ స్క్కేర్ లెగ్ మీదుగాభారీ సిక్సర్ , రెండు ఫోర్లు రాబట్టాడు. షమీ వేసినచివరి ఓవర్లో రాయుడు సిక్సర్ , ధోనీ ఫోర్ రాబట్టడంతో చెన్నై మంచి స్కోరు చేసింది.
స్కోరుబోర్డు చెన్నై:
వాట్సన్ (సి) కరన్ (బి) అశ్విన్ 26, డు ప్లెసిస్ (సి) మిల్లర్ (బి) అశ్విన్ 54, రైనా (బి) అశ్విన్17, ధోనీ (నాటౌట్ ) 37, రాయుడు (నాటౌట్ ) 21; ఎక్స్ ట్రాలు: 5; మొత్తం: 20 ఓవర్లలో 160/3;వికెట్ల పతనం: 1–56, 2–100, 3–100; బౌలింగ్ : షమీ 4–0–41–0, అశ్విన్ 4–0–23–3,కరన్ 4–0–35–0, ఆండ్రూ టై 4–0–38–0, మురుగన్ 4–0–23–0;పంజాబ్ : లోకేశ్ (సి) జడేజా (బి) కుగిలిన్ 55, క్రిస్ గేల్ (సి) ధోనీ (బి) హర్భజన్ 5, మయాం క్ (సి)డుప్లెసిస్ (బి) హర్భజన్ 0, సర్ఫరాజ్ (సి) డుప్లెసిస్ (బి) కుగిలిన్ 67, మిల్లర్ (బి) చహర్ 6, మన్ దీప్ (నాటౌట్ ) 1, కరన్ (నాటౌట్ ) 0; ఎక్స్ ట్రాలు: 4; మొత్తం: 20 ఓవర్లలో 138/5; వికెట్ల పతనం:1–7, 2–7, 3–117, 4–135, 5–137; బౌలింగ్ : చహర్ 4–0–40–1, హర్భజన్ 4–1–17–2,కుగిలిన్ 4–0–37–2, జడేజా 4–0–24–0, తాహిర్ 4–0–20–0;